Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
మూగ జీవాలకు ఖచ్చితంగా నట్టల నివారణ మందులు వేయించాలని ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్ కాపరులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో జీవాలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పశువైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించి వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, గ్రామ సర్పంచ్ అబ్బగాని పద్మసత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ గుండగాని వీరసోములు, ఉప సర్పంచ్ భాషబోయిన వెంకన్న, మండల పశువైద్యాధికారి నరేష్, డాక్టర్ శ్రీనివాస్, గోపాలమిత్ర శ్రీను, కార్యదర్శి శ్రీధర్‌తో పాల్గొన్నారు.
మద్దిరాల : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తప్పకుండా వేయించాలని మండల పశు వైద్యాధికారి అసిఫా తెలిపారు. శుక్రవారం మండలంలోని గుమ్మడవెళ్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు మందులు వేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్లపు యాకన్నయాదవ్, గోపాల మిత్రలు నాగేల్లి శ్రవణ్‌కుమార్, గొర్రె కాపరులు పాల్గొన్నారు.
సూర్యాపేటరూరల్ : మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో శుక్రవారం గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణా మందు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడీ భిక్షం మాట్లాడుతూ కాపరులు తమ మూగజీవాలకు తప్పకుండా నట్టల నివారణా మందులు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ, గోగిరెడ్డి వెంకట్‌రెడ్డి, డాక్టర్ గోపి, అనిల్ కుమార్, తిరుమలేష్, చరణ్‌నాయక్, వెంకన్న పాల్గొన్నారు.
అర్వపల్లి : గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రభుత్వం అందజేసే నట్టల నివారణ మందులను తమ మూగజీవాలకు తప్పకుండా వేయించాలని ఎంపీపీ మన్నె రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన నట్టల నివారణా మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరబోయిన సునీత, వైద్యాధికారి అర్జున్, టీఆర్ఎస్ నాయకులు మన్నె లక్ష్మీ నర్సయ్య, బైరబోయిన రామలింగయ్య, కడారి నరేష్, పద్మ, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : పాడి పరిశ్రమలో రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఎంపీపీ చింత కవితారాధారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో మూగ జీవాలకు వేసే నట్టల నివారణ మందుపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. అనంతరం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్, సర్పంచ్ అలివేలు మంగమ్మ, డా.నాగేంద్రబాబు, డా.శ్రావణి పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పట్టణంలోని ఈదులగూడ, మండలంలోని తుంగపాడు, లావూడితండా, రాంనగర్ బంధం గ్రామాల్లో శుక్రవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూకల సరళహనుమంతరెడ్డి, జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, డాక్టర్ రమాదేవి, సర్పంచ్ నాసమ్మ, ఎంపీటీసీ అరుణ, ఆదిరెడ్డి, నాగరాజు, డాక్టర్ అనుదీప్, వీఎల్వో శ్రీనివాసులు, జేవీవో జానిపాషా, కష్ణ, ఎల్ఎస్ఏ ఆరీఫ్, వీఏ శ్రీకాంత్, నాగరాజు, వాల్యా, నారాయణ, మహబూబ్ పాల్గొన్నారు.