Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
డెంగ్యూతో బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలోని జంకుతండాలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన దానవత్ నరేష్-లలిత దంపతుల మొదటి కుమార్తె దానవత్ కీర్తి (11) నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతోంది. పరీక్షలు చేయించగా డెంగ్యూ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మిర్యాలగూడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధనాయక్, జిల్లా నాయకులు భీమ్లానాయక్, నాయకులు రమేష్ నాయక్, బిక్కునాయక్, సీనానాయక్, మంగళనాయక్, మంగ్తా నాయక్, సేవానాయక్, బజ్జు నాయక్, సోమనాయక్ తదితరులు పాల్గొన్నారు.