Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - సూర్యాపేటకలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ ఒక దిక్సూచి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ వినరు కృష్ణారెడ్డితో కలిసి జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జయశంకర్ సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మెన్ వెంకటనారాయణగౌడ్, సీపీవో వెంకటేశ్వర్లు, అధికారులు ఉపేంద్ర, శంకర్, శిరీష, ఏడీ సర్వే నాగేంద్ర, ఏవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.