Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బహుజనసమాజ్ పార్టీ అణాగారిన వర్గాల కోసం పుట్టిందని పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ అన్నారు. ఆదివారం స్థానిక ఎన్జీ కాలేజీ మైదానంలో విశ్రాంత ఆడిషినల్ డీజీపీ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార సంకల్పసభలో ఆయనకు పార్టీ కండువా కప్పి సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ కలలు కన్న రాజ్యం తెలంగాణ నుండే మొదలవుతుందన్నారు. నల్గొండ నుండి రాజ్యాధికార ఉద్యమానికి సమర శంఖం పూరిస్తుందన్నారు. దేశంలో విద్యావ్యవస్థ పేద వారికి అందుబాటులో లేదన్నారు.2023లో దేశంలో బహుజన రాజ్యం వస్తుందని, బహుజన సమాజం కోసం ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలి రావడం ఆయన త్యాగనీరతిని తెలియజేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయనివిమర్శంచారు. ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను ఆయన భుజస్కందాలపై ఉందని పేర్కొన్నారు. ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ బహుజన సభను చూసిన దొరలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. తాము బానిసలం కాదు, పాలకులుగా మారి, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతామనానరు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంబంధంలేని వ్యక్తులు పాలకులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల సమాధుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా 'మీకోసం నేనొచ్చానని, కన్సీరామ్ కాలుమోపిన ఈ గడ్డ మీద నుంచి మేలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది బహుజనుల సునామీ, దీనిని అడ్డుకోవాలని చూస్తే కొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు. ఐపీఎస్ గా రిజైన్ చేసిన రోజే తన మీద కేసు పెట్టారన్నారు. ఆరున్నర సంవత్సరాల పోలీస్ సర్వీస్ లక్షల మంది బిడ్డల బతుకు మార్పు కోసం త్యాగం చేశానని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తనపై తీవ్ర ఆరోపణలు చేశాయన్నారు. బహుజనులపై ఘోరమైన కుట్ర జరుగుతుందని అందుకే బయటికి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు కోసం పెట్టిన వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల సొమ్ము విచ్చల విడిగా వథా చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో వేల పాఠశాలలు ఉన్నా పేద విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని విమర్శించారు.విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయివేటు యూనివర్సిటీ లతో అగ్రవర్ణ పేదలకు కూడా మంచి జరగడం లేదన్నారు. ప్రయివేటు వ్యవస్థలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మాటల గారడీ తో ఏడేండ్లుగా మోసపోతున్నామని, వైద్య విధానం సమూలంగా మార్పులు రావాలన్నారు. భారత రత్న కు ఓబీసీలు అర్హులు కారా...అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమాన వాటా ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉండబోతుందని, .ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కాదు,చైనా తో పోటీ పడతామనితెలిపారు. సబ్బండ వర్గాలు అణచివేతలోనే ఉన్నాయని, రాబోయే రోజులన్ని బహుజన రాజ్య సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నల్గొండ సభ దేశ రాజకీయ లను సైతం మార్చబోతుందని, .కారు కింద పడుతారో,ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోతారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. ఆయన త్యాగనీరతిని తెలియజేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయనివిమర్శంచారు. ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 2024లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను ఆయన భుజస్కందాలపై ఉందని పేర్కొన్నారు. ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ బహుజన సభను చూసిన దొరలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. తాము బానిసలం కాదు, పాలకులుగా మారి, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతామనానరు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంబంధంలేని వ్యక్తులు పాలకులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల సమాధుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా 'మీకోసం నేనొచ్చానని, కన్సీరామ్ కాలుమోపిన ఈ గడ్డ మీద నుంచి మేలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది బహుజనుల సునామీ, దీనిని అడ్డుకోవాలని చూస్తే కొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు. ఐపీఎస్ గా రిజైన్ చేసిన రోజే తన మీద కేసు పెట్టారన్నారు. ఆరున్నర సంవత్సరాల పోలీస్ సర్వీస్ లక్షల మంది బిడ్డల బతుకు మార్పు కోసం త్యాగం చేశానని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తనపై తీవ్ర ఆరోపణలు చేశాయన్నారు. బహుజనులపై ఘోరమైన కుట్ర జరుగుతుందని అందుకే బయటికి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు కోసం పెట్టిన వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల సొమ్ము విచ్చల విడిగా వథా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వేల పాఠశాలలు ఉన్నా పేద విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని విమర్శించారు.విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయివేటు యూనివర్సిటీ లతో అగ్రవర్ణ పేదలకు కూడా మంచి జరగడం లేదన్నారు. ప్రయివేటు వ్యవస్థలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మాటల గారడీ తో ఏడేండ్లుగా మోసపోతున్నామని, వైద్య విధానం సమూలంగా మార్పులు రావాలన్నారు. భారత రత్న కు ఓబీసీలు అర్హులు కారా...అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు..బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమాన వాటా ఉంటుందన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉండబోతుందని, .ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కాదు,చైనా తో పోటీ పడతామనితెలిపారు. సబ్బండ వర్గాలు అణచివేతలోనే ఉన్నాయని, రాబోయే రోజులన్ని బహుజన రాజ్య సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నల్గొండ సభ దేశ రాజకీయ లను సైతం మార్చబోతుందని, .కారు కింద పడుతారో,ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోతారో మీరే నిర్ణయించుకోవాలన్నారు.
స్వచ్ఛందంగా తరలివచ్చిన జనం
మర్రిగూడ బైపాస్ వద్ద
అంబేద్కర్, జగ్జీవన్ విగ్రహాలకు పూలమాలలు
డప్పులు, కోయనృత్యం.. పట్టణంలో భారీ ర్యాలీ
సుమారు 25ఏండ్ల తర్వాత బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభ నల్లగొండలోనే జరిగింది. ఈ సభకు ఎక్కువగా విద్యావంతులు, ఉద్యోగులు, యువత హాజరయ్యారు. దాదాపు తెలంగాణాలో ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండేలా యువత సభకు వచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ముంబాయి తదితర రాష్ట్రాల నుంచి కూడ హాజరయ్యారు. వీరంతా ఒకవైపు ప్రవీణ్‌కుమార్‌పై అభిమానం ఉన్నప్పటికి , బీఎస్పీ పార్టీ యొక్క ఆలోచనను ఏకీభవించే వాళ్లు సభకు విచ్చేశారు. దాదాపు 60వేలకు పైగా జనం సభకు వచ్చారు. వీరందరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలేజీ ముందు , గ్రౌండ్లో మూడువైపుల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 11గంటల నుంచే జనం సభ ప్రాంగణానికి రావడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలకు సభను తిలకించేందుకు సులభంగా ఉంది. బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతమ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మంద ప్రభాకర్‌లు మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న డా. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి డప్పులు, కోయనృత్యాలు, ఇతర వాయిద్యాలతో ఓపేన్ టాప్ వాహనంలో ర్యాలీగా సభ ప్రాంగానానికి విచ్చేశారు. సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నంత సేపు కాబోయే సీఎం అంటూ యువత నినాదాలు చేయడంతో మీ ఉత్సహం చూస్తుంటే ప్రగతి భవన్ ఒక ఎంతో దూరంలో లేదని, తొందరలోనే చేరుకుంటామని ప్రకటన చేయడంతో అందరు చప్పట్ల మైదానం మారుమోగింది. ఈ సభలో రాష్ట్ర నాయకులు సిద్ధార్థపూలే, పరంజ్యోతి, బాలయ్య, పూదరి నర్సింహ, జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్, గ్యార మారయ్య, టిఎస్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ , రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పోతరాజు మౌనిక , రజిత, ప్రేమలత, సుజాత, గీతా, సురేష్, రఘు, జగన్ తదితరులు ఉన్నారు.