Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టుల సమస్యల పరిస్కారానికి నిరంతరం కషి
- వడాయి గూడెం అభివద్ధిలో కషి
- టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ప్రస్తుతం వరకు తెలంగాణ రాష్ట్రసాధనలో అనేక పోరాటాలు చేసినట్టు జర్నలిస్టు ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ తెలిపారు. టీయూడబ్ల్యూజేె రాష్ట్ర కార్యదర్శిగా జర్నలిస్టు ఉద్యమ నేతగా, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో 'నేను సైతం' అని అంటూ అనేక కార్యక్రమాల్లో, పోరాటాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. టీిఆర్‌ఎస్ అధినేత ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేయడంలో సఫలీకతుడయ్యాడు.
జర్నలిస్టు ఉద్యమ నాయకుడిగా సేవలు...
జర్నలిస్టు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జర్నలిస్టుకు ఆపద వచ్చినా కూడా ఆయన ముందుండి ప్రభుత్వం నుంచి సహకారం అందించడంలో ఎంతో కషి చేశాడు. అల్లం నారాయణ సహకారంతో జర్నలిస్టుల సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాడు. తెలంగాణ ప్రెస్ అకాడమీ వచ్చిన ప్రతీ పిలుపులో చురుకుగా పాల్గొంటూ అనేక కార్యక్రమాలను విజయవంతం చేశారు. కరోనా సమయంలో కూడా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవడంలో కీలక పాత్ర వహించాడు.
పత్రికా రంగంలో 30 ఏండ్ల అనుభవం...
మొదటగా పత్రికా రంగంలో పని చేశారు. ఉదయం పేపర్, వార్త పేపర్, ఆంధ్రప్రభ, సాక్షి దినపత్రికలో 30 ఏండ్ల పాటు పాత్రికేయునిగా వత్తిని కొనసాగిస్తూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పని చేశారు. స్థానిక విలేకరిగా సుమారు రెండు దశాబ్దాల పాటు పని చేయడం వల్ల మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని రంగాల వారితో పరిచయాలు కలిగి ఉన్నాడు. డివిజన్లోని వివిధ పత్రికలతో పనిచేసే పాత్రికేయులు మిత్రులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా సంఘాలతో, స్వచ్ఛంద సంస్థలతో కలిసిమెలిసి సమస్యల పరిష్కారం కోసం కషి చేశారు. పత్రికా విలేకరిగా మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యలపై రాసిన వ్యాసాలు, వార్తలు ప్రజలను, మన్నలను చూరగొనేలా చేశాయి.
వాడాయి గూడెం అభివద్ధిలో ఎనలేని కషి...
భువనగిరి మండలంలోని వాడాయి గూడెం అభివద్ధిలో ఎనలేని కషి చేశారు. వడాయి గూడెంలో చేసిన అభివద్ధి పనులకు గాను ఉత్తమ సర్పంచ్ అవార్డును సైతం ఆ గ్రామం అందుకునేలా చేశారు. రాష్ట్రస్థాయిలో లో సర్పంచ్‌గా తన కుమారుని నిలబెట్టి , గెలిపించుకొని , ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు బాగా జిల్లాకే తలమానికంగా గ్రామానికి తయారు చేశారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి జీవిత సాఫల్య అవార్డును ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ విజయశాంతితో చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ అందుకోవడంలో కీలక పాత్ర వహించారు.
గ్రామానికి కీలక నేతల రాక... వాడాయి గూడెం గ్రామానికి కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం వచ్చేలా గ్రామానికి నిధులు కేటాయించేందుకు ఎంతో కషి చేశారు. గ్రామానికి ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణను తీసుకురావడంలో, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తీసుకురావడం, మంత్రి జగదీశ్‌రెడ్డి రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మాల గుట్టలో మొక్కలు నాటారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అంచెలంచెలుగా అభివద్ధి చేయడంలో నిరంతర కషి కొనసాగించారు. గ్రామ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.