Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ
జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణం ద్వారా మహిళల భద్రతలో మరో ముందడుగు పడిందని డీఐజీ ఏవి. రంగనాధ్ అన్నారు.నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లో నిర్మించిన భరోసా సెంటర్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవాల నేపథ్యంలో ఆయన ఆదివారం టీటీఐ, భరోసా కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా కేంద్రం ఏర్పాటు ద్వారా బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం కోసం అవసరమైన న్యాయ సహాయాన్ని అందించడం లాంటి సౌకర్యాలు కలుగుతాయని చెప్పారు. అదే విధంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు ద్వారా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వారికి కౌన్సిలింగ్ , నియమాలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా అన్ని రకాల సౌకర్యాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, రవీందర్, సురేష్ కుమార్, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, దుబ్బ అనీల్ కుమార్, నిగిడాల సురేష్, రాజశేఖర్ గౌడ్, శంకర్ రెడ్డి, గౌరు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.