Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
సమాజంలో ప్రజలను కష్టాల నుండి విముక్తి చేసేది కేవలం ఎర్రజెండా తోనే ,కమ్యూనిస్టులతో సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కొండమడుగు నరసింహ అన్నారు. ఆదివారం మండలంలోని బస్వాపురంలో నిర్వహించిన ఆ పార్టీ గ్రామశాఖ మహా సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ,ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా తాకట్టు పెడుతున్నారని దీని ఫలితంగా దేశంలో ఆకలి ,దారిద్య్రం, పేదరికం ,నిరుద్యోగం పెరుగుతుందన్నారు .నట్టేట ముంచే సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు తప్ప అమలు లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ,అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, లాంటి ఎన్నో హామీలన్నీ నీటిమూటలుగా మారాయన్నారు. మధ్య పురం బాల్ నరసింహ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, అన్నంపట్ల కష్ణ , సభ్యులు ఉడుత విష్ణు ,నరాల చంద్రయ్య ,కొండ వెంకటేష్, చిక్కుల చంద్రమౌళి, ముదిగొండ కష్ణ , నరాల కొమురయ్య ,ముదిగొండ భాస్కర్,మధు ,భాస్కర్ పాల్గొన్నారు.