Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్మశాన వాటిక కు ప్రహరీ నిర్మించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ -నకిరేకల్
పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో గల దళితుల శ్మశాన వాటికలో సమాధులను దుర్మార్గమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని దళితుల శ్మశాన వాటికలో కూల్చిన సమాధులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మశానవాటికలో సమాధులు కూల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఎన్నో హామీలు గుప్పిస్తున్నా నేటికీ అవి అమలు చేయలేని దుస్థితి ఉందన్నారు. వీటికి తోడు దళితుల స్మశాన వాటికను కబ్జా చేయడం నాయకుల దుశ్చర్యలకు తార్కాణమన్నారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం బతికుండగా ఇంటి స్థలం ఇవ్వకున్నా చనిపోయిన తర్వాత శ్మశానవాటిక లేకుండా చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. శ్మశాన వాటిక లను సమాధి చేసి కళ్యాణ మండపాలు కట్టడం వారి స్వప్రయోజనం కోస మేనని పేర్కొన్నారు. దళితులు కళ్యాణ మండపాలు కట్టమని ప్రజాప్రతినిధులను కోరారా.. అని ప్రశ్నించారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతానన్నారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, నాయకులు కొప్పుల అంజయ్య, ఆది సుధీర్, నాయకులు అంబేద్కర్, లింగాల వెంకన్న, గుండ్లపల్లి యాదగిరి, ఎండి మహబూబ్ అలీ పాల్గొన్నారు.