Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావిస్తా
- మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీ ఉత్తమ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజకీయాలను పక్కన పెట్టి గ్రామాభివద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు.ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.రాజకీయాలకతీతంగా అభివద్ధికి ముందుంటానని చెప్పారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో ప్రస్తావిస్తా నన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఆన్లైన్ బోధన అర్థం కావడం లేదన్నారు.ముఖ్యంగా సాంకేతిక సమస్యలు ఉన్నాయని, పాఠశాలలు పునర్‌ప్రారంభం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.కరోనా మహమ్మారి నివారిం చాలంటే అందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాలకు అధిక డోసులు సరఫరా చేసి అందరికీ వ్యాక్సిన్ వేయాల న్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివద్ధికి పాటుపడాలన్నారు.గ్రామాల్లో మంచినీరు, రోడ్లు, డ్రయినేజీ సమస్యను పరిష్కరించేందుకు తమ నిధులు కేటాయిస్తానని హామీనిచ్చారు. అంతకు ముందు వాటర్ట్యాంక్తండా సర్పంచ్ రామచంద్రుడు మాట్లాడుతూ తమ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని, ఏడాదిన్నరగా అధికారులను కోరుతున్నా..పట్టించుకోవడం లేదని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.పైపులైన్ పూర్తి చేసి వెంటనే మంచి నీరందించాలని కోరారు.ఈ విషయంపై సర్పంచ్, ఆర్‌డబ్య్లూఎస్ డీఈ సంపత్‌కుమార్ మధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మండలాధ్యక్షులు, ఆలగడప సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలకు కేటాయించే నిధుల్లో పక్షపాతం చూపించవద్దని సూచించారు.అంతకుముందు ఆయా శాఖల అధికారులు నివేదికను సభ ముందు ప్రవేశపెట్టారు.ఎంపీపీ నూకల సరళ హనుమంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ అజ్మీరా దేవిక, వైస్‌ఎంపీపీ అమరావతి సైదులు, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.