Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ-రామన్నపేట
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు, కార్పోరేట్లకు కట్టబేడుతూ కార్మిక హక్కులను కాలరాస్తూ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలపై క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీి సభ్యులు పైళ్ళ ఆశయ్య పిలుపునిచ్చారు. మండలంలోని నీర్నెములలో ఆ పార్టీ గ్రామ శాఖ 11వ మహాసభ నాయకులు బండ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి హక్కులను హరిస్తుందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి భారత వ్యవసాయాన్ని నిర్విర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 9న దేశ వ్యాప్తంగా నిర్వహించే క్విట్ ఇండియా దినోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి జల్లల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, ఆనగంటి వెంకటేశం, సీఐటీయూ జిల్లా ఉపాద్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి, వైస్‌ఎంపీపీ నాగటి ఉపేందర్, సర్పంచ్ జల్లల లక్ష్మమ్మ, మండల కమిటీ సభ్యులు బోయిని ఆనంద్, కల్లూరి నగేష్, శాఖ కార్యదర్శులు ఎర్ర కాటమయ్య, నాగటి లక్ష్మణ్, ఎర్ర సుమలత తదితరులు పాల్గొన్నారు.