Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పిల్లాయిపల్లి కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లాయిపల్లి కాలువ పనులు చేపట్టి సుమారు నాలుగు ఏండ్లు గడుస్తున్నా నేటి వరకు పూర్తి చేయడంలేదన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించడంలో రైతులు వందలాది కోట్లు నష్టపోయిన పరిస్థితి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లాయిపల్లి కాలువ మరమ్మతుల కోసం 102 కోట్లు ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా నేటి వరకు ఎక్కడ పనులు కూడా పూర్తికాలేదన్నారు. కాలువ ఆగమేఘాలపై చేపట్టినట్టు అధికారులు, ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకున్నారు తప్ప కాలువ చేపట్టి నెలలు గడవక ముందే కూలిపోయిన పరిస్థితి ఉందన్నారు. సైడ్ వాల్స్ డ్యామేజ్ ఎక్కడ చూసినా కాలువ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ తన నియోజకవర్గానికి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలతో గోదావరి 6 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశాడన్నారు. పిల్లాయిపల్లి కాలువ పనులను పూర్తి చేసి పోచంపల్లి మండల నుండి చిట్యాల మండలం ఉరుమడ్ల వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 15తేదీ వరకు కాలువలను పూర్తి చేయకపోతే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు పాక మల్లేశం రాఘవరెడ్డి, మర్రి నరసింహారెడ్డి, జగన్ రెడ్డి, వెంకటేశం, ,నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.