Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా భారత రక్షణ దినాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో ఆనాడు బ్రిటీష్ పాలన కోసం ఆగస్టు 9న దేశవ్యాప్తంగా నిరసన తెలిపారని, ఈనాడు కేంద్రం అవలంబిస్తున్నతీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.కొత్త చట్టాలు రద్దుచేయాలని, ప్రజా వ్యతిరేక, విద్యుత్ చట్టసవరణ ఆపాలని డిమాండ్ చేశారు.కోల్పోతున్న ఉపాధిని రక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగసంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.పెట్టుబడికి 50శాతం కలిపి కనీస మద్దతుధర ఇవ్వాలని, రుణ విమోచనచట్టం చేయాలని కోరారు.ఉపాధి హామీలో 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 వేతనమివ్వాలని కోరారు.అర్బన్ ఎంప్లాయీమెంట్ గ్యారెంటీ చట్టం తేవాలని, పనిచేసే హక్కును రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపర్చాలన్నారు.ప్రతి కుటుంబానికి రూ.7500 నగదు, పది కేజీల బియ్యం ఆరు నెలలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న నిత్యావసర, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.నేడు జరిగే నిరసనకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు జగదీశ్చంద్ర, డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, రామచంద్రు, పతాని శ్రీనివాస్ పాల్గొన్నారు.