Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిం చకపోవడం, మరొకవైపు పుఅధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంతో భువనగిరి మున్సిపాలిటీ అభివద్ధి చెందడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ తెలిపారు. ఆదివారం పట్టణంలోని హనుమాన్ వాడలో గీస అంజయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన భువనగిరికి మరిన్ని నిధులు ప్రభుత్వం కేటాయిం చాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతుందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బులు తీసుకొచ్చి దేశ ప్రజల్లో అకౌంట్లో వేస్తానని మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. అనంతరం కార్యదర్శిగా ఎడు మేక లక్ష్మణ్ సహాయ కార్యదర్శిగా బర్ల వెంకటేశం ఎన్నుకున్నారు. ఈ మహాసభల్లో పట్టణ కార్యదర్శి మాయ కష్ణ సీనియర్ నాయకులు బర్ల వెంకటేష్, నరాల నరసింహ, తోటకూర కష్ణ పాల్గొన్నారు.