Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలకేంద్రంలో తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) మండలకమిటీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రతిఘటిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా మంగళవారం కర పత్రాలతో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు.ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. రెండోసారి అధికారంలోకొచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వానికి పట్టపగ్గాలు లేవని, పార్ల మెంటులో ఉన్న బలాన్ని ఉపయోగించి అనేక నిరంకుశ చట్టాలను రూపొందించారన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి ఆహారభద్రతను దెబ్బతీసే మూడు వ్యవసాయచట్టాలను తీసుకొచ్చిం దన్నారు.అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులతో 12 గంటల పని విధానం తెచ్చి వెట్టి చేయిస్తూ బానిసత్వం లోకి నెట్టేస్తూ కనీస వేతనం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరి స్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఏదుళ్ల కవిత, ఏదుళ్లసునీత, కోరె లలిత, సైదమ్మ, సునీత,కె.పద్మ, కె.ఇందిరమ్మ, వెంక టమ్మ, కౌసల్య, లలిత, మమత, రేణుక, అనిత, యశోధ, నీలిమ పాల్గొన్నారు.