Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో నాగిరెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి మండలం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్టు భువనగిరి ఎంపీడీవో నాగిరెడ్డి తెలిపారు. ఆయన నవతెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. వారు మూడేండ్లుగా భువనగిరి మండలంలో పనిచేస్తూ మండల అభివద్ధిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సమస్య ఏదైనా సరే క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించడం ఆయన నైజం.
మండలంలో మొత్తం ఎన్ని పింఛన్లు మంజూరయ్యాయి..? ఎంత మందికి పంపిణీ చేస్తున్నారు?
భువనగిరి మండలంలో మొత్తం 5587 మంజూరయ్యాయి. వద్ధాప్య 1897, వితంతు 19 02, వికలాంగులు 932, పద్మశాలి 133, గీత కార్మికుల 430, చేనేత 129, బీడీ కార్మికులు 17, ఒంటరి మహిళలు 147 మందికి ప్రతినెలా పోస్టాఫీసు ద్వారా పింఛన్లు అందజేశాం.
నూతనంగా ఎన్ని పింఛన్లు మంజూరయ్యాయి?
2019 జూలై నెల నుంచి జూలై 2021 వరకు అర్హత ఉన్నటువంటి 497 మందికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయగా మంజూరయ్యాయి. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన వెంటనే పంపిణీ చేస్తాం.
57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ ఎప్పుడు అందజేశారు?
57ఏండ్లు పైబడిన వారికి వద్ధాప్య పింఛన్ కోసం ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 36ను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్దిదారులను గుర్తించి తగు ప్రతిపాదనలు పంపించాం.
ఉపాధి హామీలో మండలానికి ఎన్ని వైకుంఠ గ్రామాలు మంజూరయ్యాయి.. ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి?
భువనగిరి మండలంలో 34 గ్రామ పంచాయతీలకు గాను 33 వైకుంఠ గ్రామాలు మంజూరు కాగా, బస్వాపురం రిజర్వాయర్లో బీఎన్ తిమ్మాపురం గ్రామం ఉండడం వల్ల ఆ గ్రామానికి మంజూరు కాలేదు. 33 వైకుంఠ గ్రామాలలో ఇప్పటివరకు 28 పూర్తికాగా, ఐదు ప్రగతిలో ఉన్నాయి. ఈ నెల చివరిలోగా వాటిని కూడా పూర్తిచేసి 100శాతం ప్రగతి సాధిస్తాం.
వైకుంఠ ధామాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు... ఇప్పుడు వరకు ఎంత చెల్లింపు చేశారు?
ఒక్కొక్క వైకుంఠ ధామానికి రేకులతో కప్పు ఏర్పడితే రూ.11 లక్షలు, స్లాబ్ అయితే రూ.12 లక్షలా 60వేలు, ఖర్చు చేయగా మొత్తం రూ.3 కోట్లా 84 లక్షలు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.2 కోట్ల 84 లక్షలు చెల్లించాం.
మండలంలో ఎన్ని డంపింగ్ యార్డ్లు మంజూరయ్యాయి?
భువనగిరి మండలంలో బిఎన్ తిమ్మాపురం మినహాయించి 33 మంజూరు కాగా 32 పూర్తి చేశాం. నాగిరెడ్డిపల్లి భూ వివాదం కారణంగా ప్రారంభించలేదు. 20 డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నాం. త్వరలో మిగతా డంపింగ్ యార్డ్లో కూడా ఎరువులు తయారు చేస్తాం. మొత్తం షెడ్ల నిర్మాణానికి గాను రూ.83 లక్షలా 39 వేలు బడ్జెట్ మంజూరు కాగా ఇప్పటివరకు రూ.63 లక్షలా 51 వేలు చెల్లించాం.
మండలానికి ఎన్ని పల్లె ప్రకతి వనాలు మంజూరయ్యాయి.. ఎన్ని పూర్తిచేశారు?
మండలానికి మొత్తం 48 పల్లె ప్రకతి వనాలు మంజూరు కాగా ఇప్పటివరకు 46 పూర్తి చేస్తాం. బిఎన్తిమ్మాపురం రిజర్వాయర్ కారణంగా మంజూరు కాలేదు. ముస్త్యాలపల్లిలో భూ వివాదం కారణంగా ప్రారంభించలేదు.
బహత్ పల్లె ప్రకృతి వనాలు మండలానికి ఎన్ని మంజూరయ్యాయి?
మండలానికి ఒక బృహత్పల్లెప్రకృతి వనం మంజూరైంది. తుక్కాపురం గ్రామంలో పది ఎకరాల స్థలంలో బహత్ పల్లె ప్రకతి వనంను చేపడుతున్నాం. 31,000 మొక్కలను నాటి సంరక్షిస్తాం. ప్రభుత్వం రూ.44 లక్షలు మంజూరు చేసింది.
హరితహారంలో ఎన్ని మొక్కలు నాటారు? ఎంత టార్గెట్ ఇచ్చారు..?
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మండలానికి ఒక లక్షా 70 వేల మొక్కలు టార్గెట్ ఇవ్వగా, ఇప్పటికీ ఇంటింటికి ఆరు ముక్కల చొప్పున 72000 పంపిణీ చేసి, ప్రభుత్వ స్థలాల్లో రోడ్డుకు ఇరువైపులా 58 వేల మొక్కలను నాటాం. మొత్తంగా లక్షా30 వేల మొక్కలు నాటాం. ఈ నెల చివరిలోగా 100శాతం టార్గెట్ ను ప్రణాళికబద్ధంగా పూర్తిచేస్తాం.
2018లో ఉత్తమ అవార్డు ఎంపిక...
విధినిర్వహణలో ఉత్తమ ప్రజలు నిర్వహించినందుకు గాను 2018 ఆగస్టులో ఉత్తమ ఎంపీడీవో అవార్డును విద్యుత్ శాఖ మంత్రి ఇ జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
ఎన్నికల నిర్వహణలో విధులు ఉత్తమంగా నిర్వహించినందుకు గాను డెమోక్రసీ అవార్డును 2019 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు.