Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- రామన్నపేట
యూరియాను వానాకాలం పంటకు రైతులకు అందుబాటులో ఉంచాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ మండల కార్యాలయంలో పట్టణశాఖ16వ మహాసభను మునుకుంట్ల ఎల్లయ్య ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని యూరియా కొరతను నివారించి మండల రైతాంగానికి ఇబ్బంది పడకుండా ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీతో నిర్ణయించిన ధర266.50రూ ఉంటే ఎరువుల దుకాణాదారులు ధర 300 నుండి 330 వరకు అమ్ముతున్నారని విమర్శించారు. అధిక ధరలకు అమ్ముతున్నా వ్యవసాయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు తొలగించడంతో రైతాగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యే ప్రభుత్వాలకు రైతాంగం పోరాటాలతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైౖతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి జల్లెల పెంటయ్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి, పట్టణశాఖ కార్యదర్శి కందుల హనుమంతు, నాయకులు బావండ్లపల్లి బాలరాజు, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, పిట్టల శ్రీనివాస్, బావండ్లపల్లి సత్యం, బెడిదె లక్ష్మయ్య, ఆముద అంజయ్య, సల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
ఆలేరురూరల్ : ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ అన్నారు. మంగళవారం మండలంలోని శర్బనాపురం గ్రామంలోని శారద నర్సింహారెడ్డి రెడ్డి విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఆ పార్టీ 17వ గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను రోడ్డు పైన పడేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దానికి తోడుగా విద్యుత్ చట్టాలు తీసుకొచ్చి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులపై కరెంటు బిల్లులు వసూలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందన్నారు. దీని వల్ల వ్యవసాయ రంగం కార్పోరేట్శక్తల చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు, మండల కమిటీ సభ్యులు సుదగాని సత్యరాజయ్య, దూపటి వెంకటేష్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, గ్రామ సహాయ కార్యదర్శి సిరిగిరి సారయ్య, మాజీ సర్పంచ్లు సైదాపురం నర్సయ్య, సూదగని నర్సమ్మ, నాయకులు కారే రాజు, నరేందర్, సిరిగిరి స్వప్న, చంద్రకళ, బుగ్గ ప్రవీణ్, ప్రశాంత్, అంగడి నగేష్, సాగర్, ముత్తిరెడ్డి, తుంగ మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.