Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని గద్దె దించేందుకు పోరాటాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - నేరేడుచర్ల
హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కల్లూరు గ్రామంలో పార్టీ 7వ మండల మహాసభ నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు కొణిజేటి సత్యవతి ఆవిష్కరించారు. అరిబండి లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో జూలకంటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజాప్రయోజనాలు పట్టడం లేదన్నారు. కేంద్రం తన ఆధీనంలో ఉన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, వైజాగ్ స్టీల్ వంటి కంపెనీలను ప్రయివేటీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరేలా కుట్ర పన్నుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశంలోని 16 పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందిన అరిబండి లక్ష్మీనారాయణ చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచారని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, రైతు సంఘం నాయకులుగా, రైతు సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన బస్సులో ప్రయాణించే వారిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ధీరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, కొదమగుండ్ల నగేష్, కందగట్ల అనంతప్రకాష్, మర్రి నాగేశ్వర్రావు, పారేపల్లి శేఖర్‌రావు, అనేకంటి మీనయ్య, కృష్ణవేణి, గంగా, రాధమ్మ, సిరికొండ శ్రీను, చలసాని అప్పారావు, ఉప్పెలి వెంకటేశ్వర్లు, మామిడి నాగసైదులు తదితరులు పాల్గొన్నారు.