Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారంపట్టణంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చా మండల అధ్యక్షులు కనరాజు శ్రీనివాస్ పట్టణ ఉపాధ్యక్షులు హనుమంతు, కౌన్సిలర్ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు సంగు భూపతి, జిల్లా ఓబీసీ కార్యదర్శి దశరథ సీనియర్ రైతు నాయకులు గడిపే మల్లయ్య పట్టణ ప్రధాన కార్యదర్శులు బందెల సుభాష్, పులిపలుపుల మహేష్,దళిత మోర్చా అధ్యక్షులు పస్తం అంజనేయులు, ఓబీసీ మండల అధ్యక్షులు పారుపల్లి కష్ణ హరి, ఉపాధ్యక్షులు జట్ట సిద్ధులు పాల్గొన్నారు.