Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
ఉపాధిహామీ సిబ్బందిపై కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఉపాధిహామీ కంప్యూటర్ గదిలో ఉన్న సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యార్కరంలో జాతీయ రహదారి మల్టీ లేయర్లో మెగా హరితహారం కార్యక్రమంలో భాగంగా జులై 22 నుంచి గుంతలు తీసి మొక్కలను నాటిన కూలీలకు డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. పేమెంట్ సక్రమంగా ఎందుకు ఇవ్వలేదని ఏపీవోను నిలదీశారు. రికార్డు తీసుకొచ్చి చదవడం కాదని, పేమెంట్ సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అంచనాల ప్రకారం పనులు జరిగితే పేమెంట్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట ఏపీడీ సురేష్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడీ భిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌నాయుడు ఉన్నారు.