Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడ విద్యుత్ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్యోగుల నిరసన
- సంఘీభావం తెలిపిన పలు సంఘాల నేతలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యుత్ రంగంలో ప్రయివేటీకరణతో పాటు, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు-2021ను వ్యతిరేకిస్తున్నట్టు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇంజినీర్స్ ప్రకటించింది.ఈ మేరకు దేశవ్యాప్తంగా మంగళవారం నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఉద్యోగులకు, విద్యుత్ సంఘాలకు పిలుపునిచ్చింది.దీనిలో భాగంగా పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో ఉద్యోగులంతా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ప్లకార్డులు, బ్యానర్లు చేబూని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును నిరసిస్తూ నినాదాలు చేశారు.నిరసన కార్యక్రమాలకు విద్యుత్ ఉద్యోగుల సంఘాలనేతలు సంఘీభావం తెలిపి ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్బంగా విద్యుత్ బీసీ సంఘం రాష్ట్ర సహాయకార్యదర్శి మారం శ్రీనివాస్ మాట్లాడారు.విద్యుత్‌రంగంలో సంస్కరణల పేరిట కేంద్రప్రభుత్వం చేపడుతున్నచర్యల కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలు చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారన్నారు.విద్యుత్ రంగంలో ప్రయివేటీకరణ చేపట్టాలనే ప్రతిపాదనలను ప్రధాని మోడీ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్రప్రభుత్వ అనాలోచితచర్యల కారణంగా లక్షలాది కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిలు ్లతుందన్నారు.అనంతరం 1104 యూనియన్ కార్యదర్శి సోమాచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు కారణంగా విద్యుత్ సంస్థలతో పాటు, విద్యుత్ వినియోగదారులు ముఖ్యంగా వ్యవసాయదారులు, సామాన్య గహవినియోగదారులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు.327 యూనియన్ నాయకులు రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ విధుల బహిష్కరణకు ప్రతీ ఉద్యోగి సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సంఘం అధ్యక్షులు కె.విజరుకుమార్ మాట్లాడుతూ సంస్థ పరిరక్షణ కోసం ట్రేడ్ యూనియన్లు, అసోసియేషన్ల ఐక్యతతో చేపట్టిన న్యాయ పోరాటంలో ఉద్యోగులంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. 327 యూనియన్ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ఉద్యోగుల విధుల బహిష్కరణ కార్యక్రమం ద్వారా కేంద్రానికి కనువిప్పు కావాలని ఆకాంక్షించారు.1104 యూనియన్ అధ్యక్షులు షఫీఖాన్ మాట్లాడుతూ పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప..కాబట్టి విద్యుత్ ఉద్యోగులారా మనం ఎప్పుడు ధర్నా చేసిన భారీ ఎత్తున ఉద్యోగులు కదలిరావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మహిళా ఉద్యోగులు కార్మికుల ఉద్యోగులు ఆర్టీజన్ ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ బీసీ డివిజన్ అధ్యక్షులు రామ్‌చందర్, దామోదర్, బాబురావు, శ్రీనివాస్, నికిత, లతీఫ్, పాండు, ప్రసాద్, రవీందర్, సురేష్, ప్రమీల, ఆశాలత, సులోచన, భార్గవి, సరిత, ముత్తయ్య, పద్మ, శ్రీశైలం ,ప్రమీల, మల్లేష్, ఝాన్సీ, అనసూయమ్మ, కష్ణారెడ్డి, చంద్రశేఖర్, ఎగ్బాల్, లలిత, సునీత, సుగుణమ్మ, శ్రీనివాస, హరి జెరీనా పాల్గొన్నారు.