Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు నియోజవర్గ ప్రజల గోస తీరేదెన్నడో..?
- సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో అంతర్భాగంగా నిర్మిస్తున్న ఎదుల్లా రిజర్వాయర్ నుండి నిర్మించే విధంగా పథకాన్ని ఫైనల్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలకేంద్రంలోని సత్య ఫంక్షన్హాల్లో నిర్వహించిన పార్టీ ఏడో మండలమహాసభలో ఆయన మాట్లాడారు.డిండి ఎత్తిపోతల పథకానికి నీరు ఎదుళ్ల రిజర్వాయరా లేక వట్టెం రిజర్వాయర్ నుండి ఇవ్వాలా అనే సందిగ్ధతకు తావివ్వకుండా అనేకమంది ఇంజనీరింగ్ నిపుణులు, రాజకీయ పార్టీలు ఎదుళ్లరిజర్వాయర్ నుండే ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.ఈ విధంగా నీరిచ్చే సందర్భంలో సొరంగమైన లేదా పైపులైన్ల ద్వారానైనా నీటిని డిండి వాగులోకి వచ్చేలా చేయాలన్నారు.డిండిపైన నిర్మించననున్న బ్యారేజీపనులకు,మిగిలిన ఐదు రిజర్వాయర్లలోకి నీరు నింపడానికి ఉపయోగపడే ప్రధాన కాలువపనులకు కూడా నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరారు.సింగరాజుపల్లి, గొట్టిముక్కుల, కిష్టరాంపల్లి,చర్లగూడెం రిజర్వాయర్ల పనులు జరిగేలా చూడాలన్నారు.ఆ పనులు జరగకపోవడానికి భూనష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీపనులే ఆటంకంగా ఉన్నందున భూ నష్టపరిహారం మిగిలిన ప్రాజెక్టుల కిందే ఇచ్చినట్టు ఇచ్చి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించి వాటికి నిధులను కూడా వెంటనే విడుదల చేయడం ద్వారా రిజర్వాయర్ పనులు పూర్తవుతాయన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నియోజవర్గానికి వందపడకల హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పిన టీిఆర్‌ఎస్ ప్రభుత్వం వంద పడకల హాస్పటల్ నిర్మించడం ఏమో కానీ ఉన్న ఐదుపడకల ఆస్పత్రిలో ప్రజలకు అవసరమైన మౌలికవసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.మునుగోడు నియోజకవర్గానికి పాలకులు మారుతున్నారే తప్ప ప్రజాసమస్యలను పట్టించుకునేనాథుడే లేరన్నారు.నియోజకవర్గంలో ఏండ్ల తరబడిగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గకేంద్రంలో విద్యార్థులకు విద్యా వనరులు లేక జిల్లా,పట్టణ కేంద్రాలకు వెళ్లి విద్యనభ్యసించే లేక మధ్యతరగతి కుటుంబాలు మధ్యలోనే విద్యకు దూరమవుతాయని మండిపడ్డారు.మండలకేంద్రంలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ మహాసభ ప్రారంభం సందర్భంగా పార్టీ పతాకాన్ని మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న ఎగురవేశారు.మండలమహాసభకు అధ్యక్షులుగా చాపల మారయ్య ఉండగా జిల్లా కార్యదర్శివర్గసభ్యులు బండ శ్రీశైలం, యువజన నాయకులు ఐతగోని విజరు, మండల నాయకులు యసరానిశ్రీను, నారగోని నర్సింహ, పగిళ్ళ భిక్షం, వడ్లమూడి హనుమయ్య, శివర్ల వీరమళ్లు, మిర్యాల భరత్, వరికుప్పలముత్యాలు, వేముల లింగస్వామి, యాటయాదయ్య, దోటిశేఖర్, పగిళ్ళ పరమేష్ పాల్గొన్నారు.