Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట నుండి డీఈ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంను, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను తరలించొద్దని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ వలిగొండ ఆంజనేయులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాముల శేఖర్ గౌడ్, మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ జమీరోద్దిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు మాయ మాటలను చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి చేయాల్సింది పోయి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తీసివేస్తూ లక్ష ఉద్యోగాలంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, ఆ పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బషీర్ ద్దౌలా, నాయకులు మహమ్మద్ అజీముద్దీన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బర్ల స్వామి, మండల యువజన కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం అశోక్, మండల సీనియర్ నాయకులు నంగునూరి యాదయ్య, మహమ్మద్ జానీ ఉన్నారు.