Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
పట్టణంలో నిర్మాణం పూర్తయిన డబుల్బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీచేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి.సలీం డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వెనుక భాగాన నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 బ్లాకులుగా 552 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణం ,డ్రయినేజీ, మంచినీటి సౌకర్యం కల్పిస్తే నివాసానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఇప్పటికీ రెండున్నర కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు బకాయిలు ఉండడం వలన నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. బకాయి నిధులు వెంటనే విడుదల చేసి , మరో రెండు కోట్లు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. జీవనోపాధి కోసం నల్లగొండ పట్టణానికి వలస వచ్చి 20 ఏండ్లకు పైగా సుమారు పదివేల మంది అద్దె ఇండ్లల్లో నివాసముంటున్నారని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి రూ.5లక్షల నగదు ఇవ్వాలని కోరారు. నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామని ,ఈ నెల 23 నుండి కలెక్టర్ కార్యాలయం ముందు అర్హులైన పేదల అందరితో కలిసి నిరంతర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హశామ్, దండం పల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కష్ణారెడ్డి ,తుమ్మల పద్మ, దండం పల్లి సరోజ ,అద్దంకి నరసింహ,గాదె నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి ,పాక లింగయ్య ,ఊట్కూర్ మధుసూదన్ రెడ్డి , భూతం అరుణ కుమారి,ఆకిటి లింగమ్మ ,గుండాల నరేష్, కొత్త అశోక్ తదితరులు పాల్గొన్నారు.