Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్
నవతెలంగాణ- నకిరేకల్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించడం తగదని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో దళితులకు పెద్ద పీట వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ప్రజా ప్రతినిధులు కీలకపాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫాంపై ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి నేడు ఆ పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన మూడేండ్లలో నకిరేకల్ అభివద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి పనితీరు రోజురోజుకు అధ్వాన పరిస్థితికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ కౌన్సిలర్ దైద స్వప్న, నాయకులు అబ్దుల్ మజీద్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.