Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 47 లక్షల రసాయనాలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం, కారు సీజ్
- ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
- వివరాలు వెల్లడించిన డీసీపీ కె.నారాయణ రెడ్డి
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
ఆప్టిమస్ కంపెనీలో రసాయనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ విలేకర్లకు వివరాలు వెల్లడించారు. సంస్థాన్ నారాయణపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన సామ రఘునాధ్ రెడ్డి (43) కొన్నేండ్లుగా ఆప్టిమస్ కంపెనీలో షిఫ్ట్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు.ఈ మధ్య కాలంలో లక్ష్మారెడ్డి పాలెం అంబర్‌పెట్ వద్ద ఓ ఇల్లును లోన్ సదుపాయంతో కొనుగోలు చేశాడు. కంపెనీ ఇచ్చే జీతంతో లోన్ వాయిదాలు కట్టలేనని భావించి, కంపెనీలో విలువైన రసాయనం(స్టోలెన్ పల్లడియం, ప్లాటినం మెటల్)ను చోరీ చేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో వాయిదా చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కంపెనీలో నుండి రహస్యంగా దొంగిలోంచి కూకట్ పల్లి లోని ప్రగతి నగర్లో నివాసం ఉండే దూదేకుల లాలూ స్వామి(41)కి అమ్ముతున్నాడు. గత నెల దొంగిలించిన రసాయనాన్ని అమ్మాడు. ఇది గమనించిన కంపెనీ మేనేజర్ అన్నందాసు రామకష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రఘునాద్ రెడ్డి యథావిధిగా బుధవారం ఉదయం కంపెనీ నుండి రసాయనాలను దొంగిలించి అమ్మడానికి వెళ్తుండగా పక్క సమాచారంతో చౌటుప్పల్ మండలం ఎల్లగిరి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రఘునాద్రెడ్డితో పాటు లాలూ స్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం చెప్పారు. వీరి నుండి రూ.45 లక్షల విలువ చేసే రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు.టీఎస్15 ఈ జెడ్ 1786 నెంబర్ గల కారును, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ శంకర్, చౌటుప్పల్ రూరల్ సీఐ ఎరుకొండ వెంకటయ్య,ఎస్ఐ సైదిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.