Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
మండలంలోని కొండపాక గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేడి లింగమ్మ నరసింహ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సావిత్రి అంగన్వాడి టీచర్ మేడి జానకి ఆశా వర్కర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉరుమడ్ల గ్రామంలో ఏఎన్ఎం రిబ్కా ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లలిత, అంజమ్మ ,ధనమ్మ , ఆశా వర్కర్లు ,నర్మద పుష్పలత పాల్గొన్నారు. మండలంలోని తాళ్లవెల్లంల గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో సర్పంచ్ జనగాం రవీందర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి నాగమణి, ఏఎన్ఎం శైలజ, ఆశా కార్యకర్తలు స్వరూప ,రేణుక పాల్గొన్నారు.