Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బొల్లం జయమ్మ, జెడ్పీ వైస్ చైర్మెన్ ఇరిగి పెద్దులు
నవతెలంగాణ-నిడమనూరు
అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలని ఎంపీపీ బొల్లం జయమ్మ, జెడ్పీ వైస్ చైర్మెన్ ఇరిగి పెద్దులు కోరారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని తుమ్మడం ఎంపీటీసీ పెదామ యాదయ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 57 ఏండ్లు నిండిన అర్హులైన వారికి ఆసరా పింఛన్లు ఇస్తున్నట్టు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీవో రామలింగయ్య తెలిపారు. సంగబంధం గ్రూప్‌లో సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రూప్‌లో పాత వాళ్లను తొలగించి కొత్తవారిని చేర్చడం ఏంటని, దీంతో సభ్యులు ఇబ్బంది పడుతున్నారని డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బంకాపురం గ్రామంలో సంఘ బంధం లీడర్లు సభ్యులు కట్టిన డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మండలంలో మొత్తం 29 మంది సర్పంచులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీపీ బొల్లం జయమ్మ, జెడ్పీ వైస్ చైర్మెన్ ఇరిగి పెద్దులు మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన వసతుల కల్పనలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, ఎంపీడీవో కె.ప్రమోద్‌కుమార్, జెడ్పీటీసీ నందికొండ రమేశ్వరి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెదామ యాదయ్య, వేణిగండ్ల పీఏసీఎస్ చైర్మెన్ కొప్పోలు రామారావు, సర్పంచ్‌లు పిల్లి రమేష్, కొండ కృష్ణవేణి, జంగిలి రాములు, ఉన్నం శోభ, ఎంపీటీసీలు విశ్వనాధుల రాణిరమేష్, అధికారులు గ్రీష్మ, మండల వైద్యాధికారి మాధవ్ కుమార్, మండల విద్యాధికారి బాలునాయక్, పశు వైద్యాధికారి మెగ్య నాయక్, పీఆర్ ఏఈ వరలక్ష్మీ పాల్గొన్నారు.