Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
- వినియోగదారుని అవస్థలు
నవతెలంగాణ- అడ్డగూడూరు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేల రూపాయల కరెంట్ బిల్లులు వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. మండలంలోని లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన నీలగిరి శ్రీనివాస్‌కు ఒక్క నెల ఇంటి బిల్లు 11588 రూపాయలు వచ్చింది. అధిక బిల్లురావడంతో నాలుగు నెలలనుండి కరెంట్ అధికారులు, ఆఫీసు చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు విలేకర్లకు తెలిపాడు. తన ఇంటిమీటర్ సర్విస్ నెంబర్ 4602900308 గలది ఏప్రిల్ నెలలో మీటర్ డిస్ ప్లే పోయిందని, కొత్తమీటర్ అమర్చారు. క్రమం తప్పకుండా బిల్లును చెల్లిస్తున్నాడు. కొత్త మీటర్ బిగించినంక ఇంత బిల్లు వచ్చింది ల్తెన్ మేన్ రామాచారిని అడిగితే మినిమమ్ కొంతకట్టు బిల్లు సరిచేస్తానంటే చెప్పాడంతో నమ్మానని బాదితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ అంతే బిల్లు రావడం తో మోత్కుర్ కరెంట్ ఏఈ దష్టికి రాతపూర్వకంగా తెలియజేశాడు. భువనగిరి కరెంట్ ఆఫీస్‌లో అడుగండి అంటే అక్కడికి వెళ్లి అడిగాడు. మోత్కుర్ లోనే అడుగండి సంబంధం లేదు అధికారుల తెలిపారు. మోత్కుర్ కరెంటు ఆఫసులో ఒక్కనెలలో ఇంతబిల్లు వచ్చింది అని నిలదీస్తే మీటర్ లో 1167 యూనిట్లు పెండింగ్ లో ఉంది అందుకే అంతబిల్లు వచ్చింది సమాధానం ఇచ్చారు. నెల నెల క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తాను .ఒక్క నెలలో ఇన్ని యూనిట్లు ఎట్లతిరుగుతుంది అని అనుమానంతో తనపేరు మీద ఏ మీటర్ నెంబర్ పంపారని రికార్డును పరిశీలిస్తే తన మీటర్ నెంబర్ 12469681కాకుండా మరో మీటర్ నెంబర్ 12461875 పంపినట్టు గుర్తించారు. తన పాతమీటర్ కాకుండా మరో మీటర్ ఎవరిదో పంపి, ఎక్కువ బిల్లు వచ్చిందని అధికారులను ప్రశ్నించాడు. మీటర్ ఎవరి పేరుమీద పంపారో గుర్తిస్తాం అంటూ కాలయాపనచేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. నిర్లక్ష్యం చేసిన విధ్యుత్ అధికారులప్తె చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్ కోరారు.