Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
రాష్ట్ర ముఖ్యమంత్రికేసీిఆర్ కొందరికి బంధువులా మరికొంతమందికి రాబందుల వ్యవహరి స్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధును ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంఅమలు చేయాలన్నారు. బీసీ కులాల్లో 136 ఉపకులాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ లో బీసీ కులాలకు 60 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అగ్ర వర్గాలకు చెందిన నాయకుల పార్టీలు జెండాలు వేరైనా ప్రజలను దోచుకోవడమే ఎజెండాగా పని చేస్తున్నారన్నారు. బహుజన మేలుకో రాజ్యాన్ని ఏలుకో అనే నినాదంతో నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున రాజకీయ చైతన్య యాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు గణం నర్సింహ సంఘం అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ , పాలకుల యాదయ్య, దూసరి వెంకటేశం ,పందుల యాదయ్య, పందుల కార్తీక్, కుమార్, బంగారు వెంకటేష్, వరికుప్పల మధు, బండి గారి రాజు, కోడూరి నరసింహ, కుమారస్వామి, గంగపురం సాయి, వినరు, తండా వెంకన్న పాల్గొన్నారు.