Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌస్ ఆఫీసర్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి
- సూర్యాపేటన జిల్లా ఎస్పీ భాస్కరన్
నవతెలంగాణ - సూర్యాపేట
ప్రతి పోలీస్ స్టేషన్లోనూ 5ఎస్ (ఫంక్షనల్ వర్టీకల్) అమలు చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆదేశించారు. 5ఎస్ అమలుపై పని విభాగాల ఇన్చార్జి ఇన్స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలకు గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ నిర్వహించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. 5ఎస్ విధానాన్ని పక్కాగా అమలు చేసి స్టేషన్ రికార్డులు, పరిసరాలను సక్రమంగా ఉంచాలన్నారు. ఫిర్యాదు దారుల సమస్యలపై వెంటనే స్పందించాలని, ఇందుకు రిసెప్షన్ సిబ్బంది పాత్ర చాలా ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో డీిఎస్పీ మోహన్ కుమార్, పట్టణ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ విఠల్‌రెడ్డి, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి, నాగారం సీఐ రాజేష్, మునగాల సీఐ ఆంజనేయులు, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహా, పలువురు ఎస్సైలు, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.