Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తయిన స్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు
- ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రగతి వనం
- గ్రామస్తులు సహకరిస్తే రూపురేఖలు మారుస్తా : సర్పంచ్
నవతెలంగాణ-బొమ్మలరామరం
ప్రకతి వనాల ఏర్పాట్లు పల్లెల రూపురేఖలు మారిపోయాయి. మండలంలోని మర్యాల గ్రామం అభివద్ధిలో ముందుకు దూసుకుపోతోంది. సర్పంచ్ గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులు పూర్తి చేశారు. గ్రామంలో 2750 జానాభా ఉండగా 1900 మంది ఓటర్లు ఉన్నారు. మూడు మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కలెక్షన్ ఇచ్చి నీటి సమస్యను పరిష్కరించారు.
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో పాతబడిన ఇండ్లను కూల్చివేశారు.రోడ్డు పక్కల పిచ్చిమొక్కలు, చెత్త చెదారం డోజర్, జేసీబీ సహాయంతో తొలగించారు. డ్రయినేజీలో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లను శుభ్రం పరిచారు.
ఆహ్లాదం పంచుతున్న పల్లెప్రకృతివనం
గ్రామంలో ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఆరువేల మొక్కలు నాటారు. దీంతో పచ్చదనంతో ఆహ్లాదం పంచుతోంది. పల్లె గ్రామస్తులు కోసం వాకింగ్ చేయడం కోసం వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. మొక్కలు సంరక్షణకు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేశారు. మొక్కలు ,పండ్లు ,వివిధ రకాల చెట్లు గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి.
సహకరిస్తే రూపురేఖలు మారుస్తా
మర్యాల సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ్
గ్రామస్తులు సహకరిస్తే రూపురేఖలు మారుతాయి. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు వేదిక, పల్లెప్రకృతి వనం, మిషన్ భగీరథ నీళ్లు, వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రభుత్వం గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి సహకారంతో మరిన్ని అభివద్ధి పనులుచేపడ్తాం. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. పేద కుటుంబాల్లో వివాహానికి ఆర్థిక అందజేస్తున్నాం. మున్ముందు మరిన్ని సేవలందిస్తాం.
ప్రకతి వనంలో ఆహ్లాదకరం
మర్యాల 5వ వార్డు సభ్యులు అన్నారం గణేష్
పకతి వనంలో ఆహ్లాదకరంగా ఉంది. గతంలో పార్కులను చూడడానికి పట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రకతి వనాలు పార్కులుగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
రైతు వేదికతో రైతులకు ఎంతో మేలు
వడ్లకొండ సుదర్శన్ గ్రామస్తుడు
రైతు వేదిక నిర్మాణంలోరైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయ సాగు రైతులకు తెలియని విషయాలు అధికారులు చర్చించేందుకు వీళ్లు పడుతుంది. కరోనా సమయంలో కూడా రైతు వేదికలో క్యాంపు లాగా ఏర్పాటు చేసుకుని గ్రామస్తులకు కరోనా పరీక్షలు, టీకాలు ఇచ్చారు.
తీరిన వైకుంఠధామం సమస్య
టీఆర్ఎస్ మండల యువజన నాయకులు ముద్దం ఉదరు రెడ్డి
గ్రామంలో వైకుంఠధామం సమస్య తీరింది. పల్లె ప్రగతి భాగంగా వైకుంఠధామం నిర్మాణంతో పాటు అన్ని సౌకర్యాలు స్నానాల గదులు, నీటి వసతి వంటివి ఏర్పాటు చేశారు.