Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీల్డ్ పేరుతో సమయానికి రాని అధికారులు
- నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
- స్థానికంగా ఉండాలన్న కలెక్టర్
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
వ్యవసాయ శాఖ రైతు బీమా పథకం చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 12వ తేదీ గడువు ఇవ్వగా, రైతులు గురువారం ఉదయాన్నే భువనగిరి మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. 10 గంటల 30 నిమిషాలు దాటినా కూడా వ్యవసాయ శాఖ కార్యాలయం తెరుచుకోకపోవడం పై రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎక్కువగా నిరక్షరాస్యులు ఉండగా వారికి అవగాహన కల్పించాల్సిన అధికారులు ఫీల్డ్ పేరుతో సమయానికి రాకపోవడం, మరికొన్నిసార్లు ఆఫీస్‌కు కూడా రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు బీమా అప్లై చేసుకోవడానికి సంబంధించిన సైట్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్థానికంగా ఉండి సమయానికి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల పలు పత్రికలలో సమాచారం అందించినా అధికారులు కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోవడంలేదు. హైదరాబాద్, నల్గొండ, ఇతర ప్రాంతాల నుంచి రావడంతో సమయానికి అధికారులు రావడం లేదు. ఈ విషయంపై మండల వ్యవసాయాధికారిని సంప్రదిస్తే ఫీల్డ్‌కు పోయాయని చెప్పి తప్పించుకోవడం కోసం మెరుపు. భువనగిరి మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు గాను ఒక మండల వ్యవసాయ శాఖ అధికారి, 8 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు. అందరూ కూడా ఒకేసారి ఫీల్డ్కి వెళ్లడం గమనార్హం. ఈ విషయంపై పలు గ్రామాల సర్పంచులను ఫోన్లో నవతెలంగాణ ఆరా తీయగా రాలేదని తెలిపారు. యాదాద్రి జిల్లా కేంద్రంలోని సమయానికి కార్యాలయాలు తెరుచుకోకపోతే మారుమూల ప్రాంతాలలోని కార్యాలయాలు ఏ సమయానికి తెరుస్తారో ఆర్థం చేసుకోవచ్చు.
అధికారులు సమయానికి రావాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ
వ్యవసాయ శాఖ అధికారులు సమయానికి రావాలి. రైతు బీమాపై రైతులకు అవగాహన కల్పించాలి. రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ రోజున వెబ్సైట్లో నమోదు కాకపోవడంపై సమాధానం చెప్పాలి. ధికారులు ఇప్పటికైనా ఫీల్డ్ పేరు తప్పించుకోకుండా సమయపాలన పాటించాలి. అధికారులు స్థానికంగా ఉండాలి.