Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి సాధన చైర్మెన్ మంద కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్ల పిలుపుమేరకు పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండవ రోజూ సాగింది. దీక్షలకు సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు, షెడ్యూల్డ్ కులాల నాయకులు పుల్లూరీ ఏసుబు, రావి స్నేహలత, కుక్కల కృష్ణ, సిద్ధల శ్రీను, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
మఠంపల్లి : ఈ నెల 15వ తేదీలోపు దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్ష గురువారం 3వ రోజూ కొనసాగింది. దీక్షలకు కాల్వపల్లితండా సర్పంచ్ సక్రునాయక్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు కొత్తపల్లి యల్లయ్య, ఇరుగు ప్రభు, వీహెచ్పీఎస్ జిల్లా నాయకులు అమరపు సైదులు, బచ్చలకూరి నాగబాబు, జయరాజ్ పాల్గొన్నారు.