Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
యువతులు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తు న్నారు. మండల పరిధిలోని ఓ యువతి చదువుకుంటూనే వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. అనంతారం గ్రామానికి చెందిన మల్లిగిరెడ్డి వెంకట్రెడ్డి - లక్ష్మిల కుమార్తె మౌనిక సూర్యాపేటలోని ఆర్కేఎల్కే డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. చదువుతూనే తండ్రి చేస్తున్న వ్యవసాయంలో తాను సహాయ పడాలనే ఉద్దేశంతో ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ట్రాక్టర్ సాయంతో పొలం దున్నుతూ తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తోంది.