Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి
నవతెలంగాణ - చివ్వేంల
వైఎస్ఆర్ సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి కోరారు. శుక్రవారం రాజన్న యాదిలో జెండా పండగ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గుంజలూరు, తిరుమలగిరి, గుంపుల, ఉండ్రుగొండ గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించి మాట్లాడారు. వైఎస్ఆర్ పథకాలను గ్రామ గ్రామాన ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ఇతర పార్టీల నుంచి సుమారు 200 మంది ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో తిరుమలగిరి మాజీ ఉపసర్పంచి నల్లబోలు రాఘవరెడ్డి, వార్డు సభ్యులు పల్ల వెంకట నర్సయ్య దంపతులు, శ్రీరాంరెడ్డి, గుంపుల గ్రామం నుంచి వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండయ్య, రాంరెడ్డి, పిట్ట గోవింద్ రెడ్డి, ఉండ్రుగొండ నుంచి అంజయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ బీరవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటరీ కోకన్వీనర్ దేవరం లింగారెడ్డి, చంద్రశేఖర్, భాస్కర్‌గౌడ్, జ్యోతిష్రెడ్డి, గంగాధర్, రఫీ పాల్గొన్నారు.