Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి
నవతెలంగాణ-తుర్కపల్లి
ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామస్తులు అదృష్టవంతులని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35 మంది బీడీ కార్మికులకు పింఛన్ మంజూరు పత్రాలను ఆమె అందజేసి మాట్లాడారు. గత నెలలో ముఖ్యమంత్రి వాసాలమర్రి పర్యటించిన సందర్భంగా బీడీ కార్మికులు పింఛన్ రావడం లేదని ముఖ్యమంత్రి దష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పింఛన్ మంజూరు చేయాలని అధికారులను అదేశించారన్నారు. పీఎఫ్ లేకుండానే పింఛన్ పత్రాలు ఇవ్వడం హర్షణీయమన్నారు. డబ్బులను పొదుపు చేసుకుని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార,్ తహసీిల్దార్ జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి ,ఉప సర్పంచ్ మధు, పాల్గొన్నారు.