Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరుకు రూ.4 బోనస్ అందజేయాలి
- బీర్ల అయిలయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
మదర్ డెయిరీ రైతులకు మూడేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ లీటర్కు రూ.4యల ప్రోత్సహకం అందజేసి రైతులను ఆదుకోవాలని సైదాపురం పాల సంఘం చైర్మెన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం గుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు పక్షపాతిగా చెప్పుకునే సీఎం కెేసీిఆర్ రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం విడ్డూరం గా ఉందన్నారు. ప్రస్తుతం జరిగే మదర్ డెయిరీ ఎన్నికల కంటే ముందే రైతులకు రూ.4 ప్రోత్సాహం అందజేయాలని కోరారు. గతంలో డైరీ చైర్మన్ గా పని చేసిన వారు డైరీ అభివద్ధికి కషి చేయగా,ప్రస్తుత చైర్మన్ రాజకీయాలు చేస్తూ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయం చేసుకుంటూ మదర్ డెయిరీని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో చైర్మెన్ ఎన్నికైన వారందరూ వారికి న్యాయం చేసే విధంగా గా పని చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు,మంత్రులు ఇచ్చే తాయిలాలకు చైర్మెన్లు లొంగి,రైతులకు అన్యాయం చేయొద్దని సూచించారు. ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చైర్మెన్ల కొనుగోలుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. రైతులతో గెలిచిన వారికి బోనస్ అందించే వరకు ఎవరి మాట వినొద్దన్నారు.లీటర్ 4రూపాయల ప్రోత్సాహకం,చనిపోయిన గేదేలకు ఇన్సూరెన్స్,ఇస్తేనే మద్దతు ప్రకటించాలని కోరారు.ఈ సమావేశంలో ఎంపీపీ చీర శ్రీశైలం,కాంగ్రెస్ నాయకులు గుల్లపల్లి భరత్, సుడుగు శ్రీనివాస్ రెడ్డి బిట్టు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.