Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి ఎంవి.రమణ
నవతెలంగాణ- భువనగిరి రూరల్
బహుజన విప్లవ వీరుడు మొఘల్ పాలకుల ,నేదిరించి గోల్కొండ కోటను జయించిన వీడుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాటూరి బాలరాజ్ గౌడ్, ఎంవి.రమణ కొనియాడారు. పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా బుధవారం భువనగిరి ఖిల్లా పై గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 1650లో సామాన్య కల్లు గీత కుటుంబంలో పుట్టి నాటి పాలకుల చేతిలో దోపిడీ, , అణచివేత చర్యలకు పాల్పడితే సహించలేక. తిరుగు బాటు చేసిన 12మంది అనుచరులతో కలిసి,12వేల సైన్యంతో రా జ్యా దికారాన్ని సాధించి, సామాజిక న్యాయం, స్వయం పాలన అందించిన సర్ధార్ సర్వాయి పాపన్న స్పూర్తి తో బహుజన సబ్బండ వర్గాలూ పోరాడాలని పులుపు ఇచ్చారు. ఈకార్యక్రమంలో మత్స్య కారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెళ్లెల బాల క్రిష్ణ , గొర్రెల మేకల పెంపకం దారుల సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ , కల్లుగీత కార్మిక సంఘం, జిల్లా గౌరవ అధ్యక్షుడు రాగేరు కష్ణయ్య, రాజు గౌడ్, సుశాంత్, నాగెళ్లిసత్యనారాయణ, బబ్బూరి రమేశ్ లు పాల్గొన్నారు.