Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -మోటకొండూర్
ప్రభుత్వం ఆసరా పింఛన్ల గడువు ఈ నెల 31 వరకు కాకుండా అదనంగా మరికొద్ది రోజులు పెంచాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో కొల్లూరు పాండునగర్లో ఆ పార్టీ7వ మహాసభను కొల్లూరు సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. అంతకుముందు పార్టీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ఆసరా పింఛన్ లబ్దిదారులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకున్నా కరోనా పరిస్థితులను దష్టిలో ఉంచుకొని మీసేవ ద్వారా కాకుండా గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి ద్వారా ధ్రువీకరణ చేయాలని కోరారు. వంగపల్లి వద్ద 165 నేషనల్ హైవే దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించే విషయంలో స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆరెగూడెం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సుమారు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని రేషన్ షాప్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సీసీ రోడ్లు, డ్రయినేజీ, బస్టాండు నిర్మించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక , రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలంతా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి బొలగాని జయరాములు, మండల కమిటీ సభ్యులు కొల్లూరు ఆంజనేయులు, కొల్లూరు మహేందర్, భోగ రమేష్, సిహెచ్.రోమన్, కొల్లూరు సుధాకర్, బోనగిరి రాజు, కొల్లూరి నగేష్, నాగరాజు, శ్రీకాంత్, మానస, అఖిల, సరిత, నరసింహులు, నరసయ్య, సిద్దయ్య, బిక్షపతి, రమేష్, నాగరాజు, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ:ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేసేది సీపీఐ(ఎం) మాత్రమేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ అన్నారు. బుధవారం మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో ఆ పార్టీ పదవ శాఖ మహాసభ గాజుల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నైజాం కాలం నుండి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి, దోపిడీి వర్గాల పీడనం పై పోరాడేది, ప్రజా హక్కులను కాపాడేది సీపీఐ(ఎం) మాత్రమే అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోం దన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితులకు 3ఎకరాల భూపంపిణీ, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి వాటిని విస్మరించారన్నారు. ప్రస్తుతం దళిత బందు పేరుతో మళ్లీ మోసం చేయడానికి నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, మండల కార్యదర్శి మద్దెల రాజయ్య ,జిల్లా కమిటీ సభ్యులు స్వామి ,నాయకులు తుర్కపల్లి సురేందర్, కర్ణ కంటి యాదయ్య ,సంఘపాక బిక్షపతి, గాజుల మల్లయ్య, ఏనుగు నరసింహ ,నవీన్ పాల్గొన్నారు.