Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు, అధికారులతో సమావేశం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు గ్రామం కానున్న బీఎన్ తిమ్మాపురం గ్రామంలో సహాయక పునరావాస చర్యలను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. బుధవారం కలెక్టర్ తన కార్యాలయ సమావేశ మందిరంలో బీఎన్‌తిమ్మాపూర్ గ్రామస్తులు, అధికారులతో సమావేశమై భూసేకరణ, పరిహారం చెల్లింపు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామం కానున్నందున తాను స్వయంగా సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకొని, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో 37 మంది రైతులు మరణించినందున వారి కుటుంబాలు రైతుబంధు, రైతు బీమా కోల్పోతున్నాయని కలెక్టర్ దష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్పిడి వెంటనే చేపట్టి పట్టాల జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్తగా నిర్మించుకున్న 72 ఇండ్లల్లో కూడా పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని, తాగు నీరు, విద్యుత్, డ్రైనేజీ, కనీస అవసరాలు కల్పించాలని. విద్యుత్ ,పునరుద్ధరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఉన్న 1760 ఎకరాల భూమికిగాను నోటిఫికేషన్ జారీ చేసి 473 ఎకరాలు స్వీకరించిన 15 లక్షలా 60 వేల చొప్పున పరిహారం మిగిలిన ఎకరాలకు కూడా చెల్లించాలని, ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసి చేసినందున అందరికీ 15 లక్షల అరవై వేలు చెల్లించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. 104 ఎకరాల భూమికి వారసులు లేని కారణంగా కబ్జాలో ఉన్నవారికి పట్టాలు జారీచేసి భూసేకరణ జరిపి పరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, భూపాల్ రెడ్డి, ఆర్డీఓ సూరజ్ కుమార్, భువనగిరి తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఇంజనీర్లు, భూసేకరణ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తుర్కపల్లి:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దళితులంతా సద్వినియోగ పరచుకొని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కోరారు. మండలం పరిదిలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ రైతు వేదికల్లో దళిత బంద కార్యక్రమం పై కలెక్టర్దళిత కుటుంబాలకు అవగాహన కలిగించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత కుటుంబాలు తమ వత్తి నైపుణ్యం ఉన్నా పాడి పరిశ్రమ రంగాలలోనూ, ఇతర రంగాలలో, శాశ్వత జీవనాధారానికి దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, తదితర, లాభం చేకూర్చే పథకాలపై, ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్డఏ పీడీ ఉపేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్‌సుందర్, తదితరులు పాల్గొన్నారు.