Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలన్నిటినీ పర్యవేక్షించి అభివద్ధి వైపు నడిపించే నోడల్ కళాశాలగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నత విద్యావ్యవస్థలో ఓ ముఖ్యభూమిక పోషిస్తున్నదని కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య తెలిపారు. దోస్త్ మొదటి విడతలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటకు ఆప్షన్ ఇచ్చుకొని తొలి విడతలోనే దాదాపు వందమంది సీట్లు పొందిన సందర్భంగా కళాశాల ప్రత్యేకతలు-పనితీరుపై నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021-22 విద్యాసంవత్సరానికి కళాశాలలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రీ, అకడమిక్ కోఆర్డినేటర్ డా.యాదగిరి, రూసా కోఆర్డినేటర్ శ్రీకాంత్, న్యాక్ కోఆర్డినేటర్ ఇందిర, యుజిసి కోఆర్డినేటర్ బాలనర్సింహ, కళాశాల వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు రమాదేవి, తుల్జాభవాని, మధు, మక్లా, పీర్ సాహెబ్, డా.బ్రహ్మం, డా.కాంతయ్య. అమర్, బాలరాజు, కార్యాలయ సిబ్బంది జ్యోతి, ప్రదీప్, భాస్కర్, స్వరూప, వెంకన్న, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు