Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట:
మీసేవా కేంద్రాల్లో ఆసరా వద్ధాప్య పింఛన్ దరఖాస్తుకు సేవ రుసుం వసూలు చేయడం తగదని సీపీిఐ(ఎం) మండల కార్యదర్శి జల్లెల పెంటయ్య అన్నారు. సేవా రుసుం వసూలు చేస్తున్న మీ సేవ కేంద్రాల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వద్ధాప్య పింఛన్‌కు మీ సేవా కేంద్రాల్లో ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని ప్రభుత్వం నిబంధనలు విధించినప్పటికీ ష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని మీసేవా కేంద్రాలు వద్ధుల నుండి 50 నుండి 100 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నాయని విమర్శించారు. వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి తగుచర్యలు తీసుకోవాలనిడిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, బోయిని ఆనంద్, పండుగ రాజమల్లు, రషీద్, కొమ్ము అంజయ్య, గోగు లింగస్వామి, ప్రశాంత్ పాల్గొన్నారు