Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు
- రూ. కోటీ 30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ నియోజకవర్గం శరవేగంతో అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో రూ.కోటీ 30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రయినేజీ నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపిస్తే ఉపేక్షించబోమని గుత్తేదారులు, అధికారులను హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ఏడుకోట్ల తండా,రాజీవ్ నగర్ లో రూ.20 లక్షల నిధులతో డ్రయినేజీ నిర్మాణం పనులకు, ప్రకాష్ నగర్లో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, అశోక్‌నగర్ కాలనీలో రూ. 20 లక్షల నిధులతో సీసీ డ్రయినేజీ నిర్మాణం పనులకు, రామచంద్ర గూడెంలో రూ.50 లక్షల నిధులతో సీసీ, డ్రయినేజీ నిర్మాణ పనులకు, బంగారుగడ్డలో రూ.20 లక్షల నిధులతో డ్రైనేజి నిర్మాణ పనులను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సాయి లక్ష్మీ, కౌన్సిలర్లు జావీద్, తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, మాలోతు రాణి శ్రీను, ఇలియాస్, రమావత్ కమిలి భీంలా నాయక్, ఉదరు భాస్కర్, ఖాదర్, నాయకులు సైదిరెడ్డి, సిద్దగాని యాదయ్య, గుండ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీద్, ఖాజా, మైనారిటీ నాయకులు ఫహీం, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు, ప్రజలు పాల్గొన్నారు.