Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతగిరి
వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ మత్స్య శాఖ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచాననే అక్కసుతోనే తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండల పరిధిలోని పాలవరం గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు లింగం శేషయ్య ఆరోపించారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తాను అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు చెరువు సంబంధిత లావాదేవీల్లో ఎలాంటి అవినీతికీ పాల్పడలేదన్నారు. చెరువును కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరికీ అప్పజెప్పలేదన్నారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను గెలిచిన రెండేండ్ల కాల వ్యవధిలో కరోనా నిబంధనల దృష్ట్యా జనరల్ బాడీ సమావేశం నిర్వహించలేదని, దీన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని తెలిపారు.