Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతగిరి
వివాదాస్పద భూమిలో జరుగుతున్న పనులను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన గురువారం మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 51లో పదకొండు ఎకరాల భూమి ఉంది.ఆ భూమిపై అదే గ్రామానికి చెందిన బాణాల అమృత భయమ్మ, దాట్ల వెంకటప్పయ్య ఇరువురు కుటుంబాల మధ్య కొన్నేండ్లుగా వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. కోర్టు తీర్పు వచ్చేంత వరకూ ఆ భూమిలో ఎవరూ వ్యవసాయ పనులు చేపట్టొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ దాట్ల వెంకటప్పయ్య కుమారులు ట్రాక్టర్ సాయంతో భూమిని దున్నేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భూమి యజమానులు ఎవరో తెలిసేంత వరకూ పనులు చేపట్టొద్దని పోలీసులు వారిని ఆదేశించారు.