Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్
నవతెలంగాణ - చివ్వేంల
అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ అన్నారు. గురువారం మండలంలోని ఈజీఎస్ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించి మాట్లాడారు. మల్టీ పర్పస్ వర్కర్లకు ఇన్సూరెన్స్ చేయించాలని కార్యదర్శులకు సూచించారు. గ్రామాల్లో డెంగీ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీపీవో యాదయ్య, ఎంపీడీవో జమాలరెడ్డి, ఎంపీవో గోపి, ఏపీవో నాగయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతగిరి:మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ పాటిల్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అన్ని గ్రామాల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ సంబంధిత పనులపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయన్నారు. గ్రామాల్లో నీటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లెప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో నాగేశ్వర్రావు, ఏపీవో శైలజ తదితరులు పాల్గొన్నారు.