Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
నేడు జరిగే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్ కోరారు. గురువారం స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్స్ వేసి భర్తీ చేయాలన్నారు. ఖాళీగా ఉన్న 23080 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖలలో తొలగించిన 52515 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న 27 మంది నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.