Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పక్షవాతం బాధితుడి కుటుంబానికి దాతల సహకారం స్ఫూర్తిదాయకం
అ మారం శ్రీనివాస్, రాపోలు పరమేష్ సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలి
అ మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
పక్షవాతం వచ్చిన వ్యక్తి కుటుంబానికి దాతల సహాయ సహకారాలు స్ఫూర్తి దాయకమని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు అన్నారు. పక్షవాతంతో కాళ్లు, చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమై కుటుంబ పోషణ భారంగా మారిన చెరుపల్లి నాగరాజు అనే బాధితుడి కుటుంబానికి బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మారం శ్రీనివాస్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ వెన్నుదన్నుగా నిలిచారు. రూ.60వేల వ్యయంతో టిఫిన్ సెంటర్ నిర్వహణ కోసం తోపుడు బండి, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, ఇడ్లీ పాత్ర, కూలింగ్ వాటర్ క్యాన్, అన్ని రకాల నిత్యావసర సరుకులను పద్మశాలి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమక్షంలో డీఎస్పీ వెంకటేశ్వర్ రావు చేతుల మీదుగా నాగరాజు కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులంతా తమ జీవితాంతం గుర్తుంచుకునేలా మానవతా దృక్పథంతో సాయమందించిన మారం శ్రీనివాస్, రాపోలు పరమేష్ సేవలు అనిర్వచనీయమైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ నిగిడాల సురేష్, ఎస్సై, మాజీ పద్మశాలి మహిళా అధ్యక్షురాలు రాంబాయమ్మ, మాజీ కౌన్సిలర్లు నామని సోమయ్య, మాజీ కౌన్సిలర్ బావాండ్ల పాండు, బిజేపీ నాయకులు చిలుకూరి శ్యామ్, పద్మశాలి నియోజకవర్గం కన్వీనర్ పున్న రాములు, మిర్యాలగూడ పట్టణ స్టీరింగ్ కమిటీ మసరం వెంకట్ రాములు, యామిని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, పగిడి మర్రి సత్యనారాయణ పాల్గొన్నారు.