Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
ఈనెల 20న గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రామపంచాయతీ శంఖారావం బహిరంగ సభకు ఊరుకో బండితో హుజురాబాద్ కు పోదాం అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శంఖారావం బహిరంగ సభ పోస్టర్ను గురువారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులు ఏండ్ల తరబడిగా గ్రామాల్లో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నకిరేకంటి రాము, కార్యదర్శి బందెల బిక్షం, గాదె యాదయ్య, సాల్వే రు ఎల్లాజీ, రమేష్, యాదమ్మ, వసంత, మంగమ్మ, లక్ష్మి, బచ్చే యాదయ్య, బొడ్డు సాలయ్య, గాదె ఎల్లయ్య, నర్సింహ పాల్గొన్నారు.
బొమ్మలరామరం: జీపీ, మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు పీఆర్సీని వర్తింపజేయాలని హుజురాబాద్లో నిర్వహించనున్న శంఖారావం సభను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ రేకల శ్రీశైలం కోరారు. గురువారం మండలకేంద్రంలో ఆయనవ ఇలేకర్లతో మాట్లాడారు. ప్రతి కార్మికుని కుటుంబానికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దెంకి యాదగిరి లక్ష్మీకాంత్ తుడు మైసయ్య కిష్టమ్మ పెంటమ్మ మల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.