Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకుడిని అరెస్ట్ చేసిన చైతన్యపురి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కష్ణ
నవతెలంగాణ - మలక్‌పేట్
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ నాగోల్ రోడ్ నెంబర్ 3లో వద్ధ దంపతులు నివసిస్తున్నారు. వారు నివసించే ఇంటి ఫ్రంట్ డోర్ అద్దాలను పగుల గొట్టి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డా ్డరని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న చైతన్యపురి పోలీసులు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక అను మానితుడిని పట్టకున్నారు.
పట్టుకున్న అనుమానితుడిని విచారించ గా ఫిర్యాదు చేసిన వద్ధ దంపతుల నివాసంలో కేర్ టేకర్‌గా చేరాడు. ఆ వద్ధ దంపతుల నివాసంలో ఇద్దరు మాత్రమే ఉండటం, వారి పిల్లలు విదేశాల్లో ఉండటం గమనించి నిందితుడు ముందుగా ప్లాన్ చేసుకొని నిందితుడు మా అమ్మ అనారోగ్యంతో ఉందని, ఊరికి వెళ్లాలని వద్ధ దంపతులకు చెప్పి వెళ్ళాడు. రెండు రోజుల తర్వాత అదే వద్ధ దంపతుల నివాసానికి రాత్రి సమయంలో ప్రహరీ గోడ మీదుగా బాల్కనీలోకి ప్రవేశించి గ్లాస్ డోర్‌ను పగలగొట్టి దొంగతనం చేసే ప్రయత్నం చేస్తుండగా, గ్లాస్ డోర్ పగిలిన శబ్దం రావడంతో యజమాని అప్రమత్తం అవడంతో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడని. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న దష్ట్యా ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కష్ణ ప్రజలకు సూచించారు. ఫిర్యాదు చేసిన 24గంటలో నిందితుడిని పట్టుకున్నామని, ఈ కేసును చేధించడం లో క్లూస్ టీం, సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర పోషిం చాయని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కష్ణ, సబ్ఇన్స్పెక్టర్ అలీ మీడియాకి తెలియజేసారు.